calender_icon.png 3 April, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్ వ్యక్తి కి తీవ్ర గాయాలు

27-03-2025 01:32:45 AM

మఠంపల్లి, మార్చి 26: సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలంలోని రఘునాథ పాలెం గ్రామంలో బుధవారం మజీద్  దగ్గర మఠంపల్లి గ్రామానికి చెందిన మిర్చి కూలీల ఆటో ని ఈ గ్రామానికి చెందిన నాయుడు గురవయ్య ట్రాక్టర్ తో ఢీకొనడంతో ముందు సీట్లో కూర్చున్న దైద మానస భర్త బాలస్వా మి కుడి కాలుకు తీవ్రంగా గాయాలయ్యాయి.

వైద్యం నిమిత్తం సూర్య పేట ఏరియా ఆసుపత్రికి తరలించారని, బాధితురాలు పరిస్థితి విషమించడంతో  ఏరియా ఆసుపత్రి నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై  మఠంపల్లి పోలీస్ స్టేషన్ లో దైద మానస కు వరుసకు మామ అయిన దైద రాయులు దరఖాస్తు ఇచ్చారని ఈ విషయంపై మఠంపల్లి సబ్ ఇన్స్పెక్టర్ పి.బాబు మాట్లాడుతూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.