కామారెడ్డి, ఫిబ్రవరి 5 (విజయ క్రాంతి) : ద్విచక్ర వాహనం అదుపుతప్పి క్రింద పడడంతో ఓ వ్యక్తి తలకు తీవ్ర గాయలైన ఘటన పల్వంచ మండలం భవానిపెట్ గ్రామ శివారులో మూల మలుపు వద్ద బుదవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు..
రామాయంపేట లో స్థానికంగా ఉంటున్న ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లాకు చెందిన ఇప్పి రమణ(34) ద్విచక్ర వాహనం పై వస్తుండగా అదు పుతప్పి క్రింద పడడంతో తలకు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగ స్థానికులు గమనించి 108 అంబులెన్సు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న మాచారెడ్డి 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని బాధితుని అంబులెన్సులో కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు సిబ్బంది మానవత దృక్పథంతో క్షతగాత్రుడి దగ్గర ఉన్నరూ.
1360 నగదు స్మార్ట్ ఫోన్ ఆధార్ కార్డు బైక్ కి డైరీ జిల్లా ఆస్పత్రిలో గాయపడిన వ్యక్తి కుటుంబ సభ్యులకు హాస్పిటల్ సిబ్బంది సమక్షంలో అందజేశారు.108 ఈఎంటీ మెతుకు నరేష్ , పైలెట్ మాలోతు తరుణ్ లను స్థానికులు, కుటుంబ సభ్యులు అభినందించారు కృతజ్ఞతలు తెలిపారు.