29-04-2025 11:04:25 PM
ఇబ్రహీంపట్నం: స్కూటీపై నుంచి పడి వ్యక్తికి తీవ్ర గాయాలైనా సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మన్నెగూడలో మంగళవారం సాయంత్రం ఇబ్రహీంపట్నం నుండి ఎల్.బి నగర్ వైపు స్కూటీ పై వెళ్తున్న ఆ వ్యక్తి మార్గమధ్యలో మన్నెగూడ, నాగార్జున సాగర్ రోడ్డు పై స్కూటీ అదుపుతప్పి కింద పడిపోయాడు. దింతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.. వెంటనే అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు 108 అంబులెన్సుకు సమాచారం ఇచ్చారు. కింద పడిన వ్యక్తికి తల నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోయాడని, తీవ్రంగా గాయపడిన వ్యక్తి ని అంబులెన్సు ద్వారా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సింది.