కడ్తాల్ మండలం టాకురాజుగూడ వద్ద ఘటన...
కడ్తాల్ (విజయక్రాంతి): కారు బైక్ ఢీకొని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన కడ్తాల్ మండలం టాకురాజుగూడ తండా శివారులో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన పవన్ మరో ఇద్దరు యువకులతో కలిసి వ్యక్తిగత పనిమీద కడ్తాల్ వెళ్లి తిరిగి తలకొండపల్లి వెళుతున్న క్రమంలో కడ్తాల్ మండలం టాకురాజుగూడ వద్ద బైక్-కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పవన్ తీవ్రంగా గాయపడగా మరో ఇద్దరు యువకులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. పవన్ ని చికిత్స కోసం 108లో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.