28-03-2025 01:07:57 AM
కల్వకుర్తి మార్చి 27 : తాగి వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కిన వ్యక్తికి నాలుగు రోజుల జైలు శిక్ష విధిస్తూ కల్వకుర్తి కోర్టు ఉత్తర్వులు ఇచ్చినట్లు వెల్దండ ఎస్త్స్ర కురుమూర్తి పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్ 19న డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు జరుగుతున్న క్రమంలో కల్వకుర్తి ప్రాంతం లోని భగత్ సింగ్ కాలనీకి చెందిన ఇస్లావత్ శీను తాగి వాహన నడుపుతూ పోలీసులకు చెప్పాడు.
అతనికి పరీక్షలు జరిపి కోర్టులో హాజరపరచగా కల్వకుర్తి కోర్టు నాలుగు రోజుల జైలు శిక్షణ విధిస్తూ గురువారం ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపద్దని ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి పొందాలని ఎస్‌ఐ పేర్కొన్నారు.