calender_icon.png 28 April, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దారుణం.. వ్యక్తిని చంపి బ్యాంక్ భవనం లిఫ్ట్‌లో పడేశారు..

28-04-2025 01:01:25 PM

హైదరాబాద్: నగరంలోని హిమాయత్ నగర్ పోలీస్ స్టేషన్(Himayat Nagar Police Station) పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ భవనం లిఫ్టులో వ్యక్తి హత్యకు గురయ్యాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకు(Punjab National Bank) భవనంలోని లిఫ్ట్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న క్లూస్ టీమ్, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలాన్ని మధ్యమండలి డీసీపీ శిల్పవల్లి పరిశీలించారు.