calender_icon.png 22 December, 2024 | 4:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యక్తి దారుణ హత్య

22-12-2024 11:17:50 AM

సికింద్రాబాద్,(విజయక్రాంతి): బోయిన్ పల్లి పోలీస్  స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. సమీర్ అనే వ్యక్తి ఇంటి ముందు కూర్చొని స్నేహితులతో కలిసి మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని దుండగులు కత్తులతో వచ్చి దాడి చేసి పొడిచి చంపేశారు. సమాచారం అందుకున్న నార్త్ జోన్ డీసీపి సాధన రష్మీ పెరుమాళ్ , పోలీసు సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. చుట్టు ప్రక్కల విచారించించగా, గత కొద్ది రోజుల క్రితం సమీర్ తను పని చేస్తున్న సంస్థ యజమాని కుమార్తె ఫిర్దోజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

సమీర్ ను హత్య చేసిన వారు మేమేం చంపేశామంటూ నినాదాలు చేసుకుంటూ వెళ్లారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే సమీర్ భార్య బంధువులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని, పరువు హత్య జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృదేహాన్ని స్వాధీనం చేసుకోని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.