calender_icon.png 15 March, 2025 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంట్లో సమాచారం ఇవ్వకుండా వ్యక్తి అదృశ్యం..

14-03-2025 08:14:39 PM

ముషీరాబాద్,(విజయక్రాంతి): ఇంట్లో ఎవరికీ సమాచారం ఇవ్వకుండా వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. గాంధీనగర్ ఇన్స్పెక్టర్ డి.రాజు తెలిపిన వివరాల ప్రకారం... సికింద్రాబాద్ న్యూ బోయిగూడ జై నగర్ కాలనీకి చెందిన  మొక్కల సాయికుమార్ (53) అనే వ్యక్తి కాంట్రాక్టు ప్రాతిపదికన క్యాటరింగ్ చెఫ్ గా పనిచేస్తున్నాడు. కాంట్రాక్ట్ దొరికినప్పుడే పనికి వెళ్లేవారు అని సాయికుమార్ కుమారుడు శ్రవణ్ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 28 ఉదయం 4 గంటలకు ఇతరుల ఫోన్ నుండి ఫోన్ చేసి  వారం పాటు క్యాటరింగ్ పనిలో  ఉన్నానని తెలియజేశారని, వారం రోజులు గడిచినా తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన సాయికుమార్ కుమారుడు శ్రవణ్ కుమార్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. సాయికుమార్ 5.6 ఎత్తు, తెలుగు, హిందీ భాషలు ఎడమ చేతి వీళ్ళపై పచ్చబొట్టు ఉన్నదని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ డి. రాజు వెల్లడించారు.