05-04-2025 12:48:16 AM
ముషీరాబాద్,(విజయక్రాంతి): చాయ్ తాగి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన వ్యక్తి అదృష్టమైన సంఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ బి. రాజు నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ కు చెందిన సుకుమార్ దాస్ (77) అనే వ్యక్తి అశోక్ నగర్‌లో ఉంటున్న తన మనమరాలైన పుష్ప ఇంటి వద్ద కొన్ని రోజులు ఉండి వెళ్దాం అనుకొని వచ్చాడు. శుక్రవారం చాయ్ తాగి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో మనమరాలు పుష్ప చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తప్పిపోయిన వ్యక్తి కృష్ణ భక్తుడు అని, బెంగాలీ భాష మాత్రమే తెలుసని పుష్ప ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ఇతని ఆచూకీ తెలిసినవారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని ఇన్స్పెక్టర్ కోరారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.