calender_icon.png 12 January, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాముతో సెల్ఫీ సరదా.. ప్రాణం తీసింది

06-09-2024 02:06:47 PM

ఓ యువకుడి ప్రాణాలు హరి

కామారెడ్డి జిల్లాలో పాముతో చెలగాటమాడి ప్రాణాలు కోల్పోయిన యువకుడు

కామారెడ్డి జిల్లాలో విషాదం

కామారెడ్డి, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీయాలనుకొని పాముతో చెలగాటం ఆడాడు. ఆ పాము కాటేయడంతో ప్రాణాలు వదిలాడు. ఈ విషాదకర సంఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. దేశాయిపేట గ్రామంలో పాములను పడుతూ జీవనం సాగిస్తున్న ఓ కుటుంబం ఉంది. గ్రామానికి చెందిన మోచి గంగారం కుటుంబం పాములు పాడుతూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం ఓ నాగుపామును పట్టుకున్న గంగారం తన కుమారుడు శివరాజుకు ఇచ్చాడు. పామును పట్టుకుని సెల్ఫీ వీడియో పెట్టమని కోరడంతో ఆ యువకుడు అత్యుత్సాహానికి పోయి రకరకాల భంగిమల తో పాములు పట్టుకొని సెల్ఫీలు దిగాడు.

నోటితో పట్టుకొని సెల్ఫీ దిగాపోగా నాగుపాము మూతి వద్ద కాటు వేసింది. తమకేమీ కాదని అత్యుత్వం తో మరో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించడంతో శివరాజు 18 సంవత్సరాలు నురుగులు కక్కుతూ కింద పడిపోయాడు. వెంటనే అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడు. సరదాగా సెల్ఫీలు దిగి ఫోటోలు పెట్టుమనీ అన్నందుకు  శివరాజు సెల్ఫీల మోజులో పాము కాటు వేసిన నిర్లక్ష్యంగా ఉండడంతో ప్రాణాలు వదిలాడు. గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా మోచి గంగారం పాములుపడుతూ తన కొడుకు ప్రాణం పాము కాటు వల్ల చనిపోతాడని ఊహించుకోలేకపోయానని ఏడవడం గ్రామస్తులను కలిచివేసింది. ఈ హృదయ విదారక సంఘటన చూసి గ్రామస్తులు కంటితడి పెట్టారు. ఉన్నా ఒక్క కొడుకు పాము కాటుతో మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.