05-04-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 4 (విజయక్రాంతి) : నగరంలోని ప్రముఖ నిమ్స్ ఆస్పత్రి ఎమర్జెన్సీ భవనం రెండో అంతస్తు నుంచి ఓ రోగి సహాయకుడు దూకాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయాలు కాగా అదే హాస్పిటల్‌లో చిక్సిత పొందుతూ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన పోషం హనుమాండ్ల అనే వృద్ధుడు అనారోగ్యంగా ఉండడంతో కుటుంబ సభ్యుడు ఆయనను నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. హనుమండ్లకు సహాయకుడిగా ఆయన ఇద్దరు కుమా రులు ఆస్పత్రికి వచ్చారు. ఆయన రెండో కుమారుడు నారాయణ శుక్రవారం ఆస్పత్రి భవనంపై నుంచి కిందకి దూకాడు. భవనం పైనుంచి దూకడానికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా అతనికి కల్లు తాగే అలవాటు ఉందని, కొన్ని రోజులుగా కల్లు లేకపోవడంతో వింతగా ప్రవర్తి స్తున్నట్లు తెలుస్తోంది.