15-03-2025 03:04:47 PM
108 ద్వారా ఆస్పత్రికి తరలింపు..
వైరా,విజయక్రాంతి: వైరా మండల పరిధిలోని గన్నవరం నుంచి నెమలి వెళ్లే రోడ్లో వాగు సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నారు ద్విచక్ర వాహనం పై వస్తున్న వ్యక్తి ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనం పక్కకు దూసుకెల్లగా ఆ పక్కనే వ్యక్తి సొమ్మసిల్లి పడి ఉన్నారు. వెంటనే 108 వాహనానికి ఫోన్ చేయగా వాహనం అక్కడ చేరుకొని వ్యక్తిని హాస్పటల్ కు తరలించారు గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి వెళ్ళిపోయి ఉండొచ్చని అక్కడివారు భావిస్తున్నారు క్షతగాత్రున్ని బోనకల్ మండలం పెద్ద బీరువల్లి గ్రామానికి చెందిన నాగేశ్వరావు అనే వ్యక్తిగా పలువురు గుర్తిస్తున్నారు