ఎల్లారెడ్డిపేట, డిసెంబర్ 31: ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామ శివా రులో ఆటో బోల్తా కొట్టి పల్టీలు కావడంతో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థాని కులు తెలిపిన వివరాల ప్రకారం గొల్లపల్లి గ్రామానికి చెందిన బండి అనిల్ (30) ఆటో నడుపుకుంటూ గొల్లపల్లి ఎల్లారెడ్డి పేట ప్రధాన రహదారి రెడ్డి రెస్టారెంట్ వద్ద డివైడర్‌కు ఢీకొట్టాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రున్ని వెంటనే స్థానికులు అంబులెన్స్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తర లించారు. సమాచారం అందుకున్న పోలీ సులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.