calender_icon.png 21 April, 2025 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి

21-04-2025 06:48:11 PM

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): లక్షెట్టిపేట మండలంలోని ఎల్లారం గ్రామ జాతీయ రహదారి పై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మునుగంటి చంద్రశేఖర్ (51) అనే వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. సోమవారం ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం... మృతుడు వెంకట్రావుపేట గ్రామానికి చెందిన వాడని ఆదివారం మధ్యాహ్నం మృతుడు తన పురోహితం పని ముగించుకొని వెంకట్రావుపేటకు బైక్ పై వెళ్తుండగా వెనకాల నుండి బెలినో కార్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడన్నారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు జాహ్నవి పిర్యాదు మేరకు వాహన డ్రైవరుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.