కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘటన
పతంగి వదులుతున్న దారం తగిలి గాయాలు
కామారెడ్డి, (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం మాంజా వైర్ తగిలి పోకండి గాయాలైన ఘటన వెలుగు చూసింది. కామారెడ్డి తైలాన్ బాబా కాలనీ కి చెందిన జావిద్ బుధవారం ఉదయం హైదరాబాదులోని జిమ్ముకు బైకుపై వెళ్తుండగా పతంగి తో దారం వచ్చి బైక్ పై వెళ్తున్న జావిద్ కు తగిలి తలకింద గాయాలయ్యాయి.
పతంగికి కట్టిన మంజదారం కావడంతో గాయాలైనట్లు బాధితుడు తెలిపారు. వెంటనే అతనిని సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మాంజా దారం ఉపయోగించవద్దని ఒకవైపు అధికారులు పోలీసులు చెప్తున్నా మంజ దారం వాడడంతో పలువురు గాయలైన ఘటనలు వెలుగు చూస్తున్న పతంగి ఆడేవారు మంజ దారాన్ని ఉపయోగిస్తూ పలువురికి గాయాల పాలు చేస్తున్నా ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కామారెడ్డిలో జరిగిన ఘటన కల కలం రేపింది.