calender_icon.png 11 February, 2025 | 2:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాంసాగర్ ప్రాజెక్టులో వ్యక్తి గల్లంతు

10-02-2025 01:42:20 AM

నిజాంసాగర్ ఫిబ్రవరి 9 : ఎల్లారెడ్డి మండలం అన్నసాగర్ గ్రామానికి చెందిన కర్రె విట్టల్ (40), నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువలో పడి ఆదివారం గల్లంతయ్యారు. ఎస్త్స్ర శివకుమార్ కథనం ప్రకారం కర్రె విట్టల్ మిషన్ భగీరథ పథకంలో భాగంగా విధులు నిర్వహి స్తుండగా, మహమ్మద్ నగర్ సమీపంలోని నిజాంసాగర్ కాలువలో చేపలను చూసి పట్టుకునే క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. పోలీసులు, నీటి పారుదలశాఖ అధికారుల సహకారంతో ప్రాజెక్టు నుండి నీటి విడుదల నిలిపివేశారు. అనంతరం కర్రె విఠల్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్త్స్ర శివకుమార్ తెలిపారు.