చేవెళ్ల (శంకర్‌పల్లి), డిసెంబర్ 21: మద్యం మత్తులో వాహనం నడిపి మహి ళ మృతికి కారణమైన వ్యక్తికి కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది. శంకర్‌పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్ వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలం కందవాడకు చెందిన ఫిరంగ రవి, తన భార్య లక్ష్మితో కలిసి శంకర్‌పల్లికి ఆస్పత్రికి వచ్చాడు. బైక్‌పై స్వగ్రామానికి బయల్దేరగా రామంతపూర్ శివారులోకి వెళ్లగానే నవాబుపేట మండలం మాదారానికి చెందిన కావలి అనిల్ కుమార్ బైక్‌తో ఢీకొట్టాడు. ప్రమాదంలో లక్ష్మి చనిపోయింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు చార్జీషీట్ ఫైల్ చేసి కోర్టుకు సమర్పించారు. విచారణ అనంతరం ఎల్బీనగర్ 9వ సెషన్స్ కోర్టు జడ్జి నిందితుడికి పదేండ్ల జైలు శిక్ష విధించింది.