calender_icon.png 3 October, 2024 | 6:58 PM

మనిషి రక్తం రుచి మరిగిన తోడేలు.. ఆపరేషన్ భేడియా

03-09-2024 04:13:01 PM

బహరాయిచ్: మనుషులు తోడేళ్ల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతూ ఉంటారు.. తోడేళ్లు సంఘజీవనానికి ప్రతీక వేట.. అయినా ఆట అయినా గుంపుగానే చేస్తాయని వాటికి పేరు.. కానీ ఉత్తర ప్రదేశ్ లోని రక్తం రుచి మరిగిన తోడేలు కథ భిన్నంగా ఉంది.. ఒంటరిగా వస్తోందా ? గుంపు గా వస్తున్నాయా తేల్చ లేక పోతున్నారు.. యూపీలోని బహరాయిచ్ జిల్లాలో తోడేళ్ల దాడులు ఆగటం లేదు. వీటిని పట్టుకోవటానికి ఆపరేషన్  భేడియా  చేపట్టినా సరే పూర్తి స్థాయిలో ఫలితాలు రాలేదన్నారు. ఇక జంతు శాస్త్ర నిపుణఉల వాదన భిన్నంగా ఉంది. అటవీ శాఖ భావిస్తున్నట్లు గుంపుగా తోడేళ్లు ఈ దాడులు చేయడం లేదని  ఏదో ఒక తోడేలు మాత్రమే మనిషి రక్తం రుచి మరిగిందనీ వూల్ఫ్ బయాలజిస్టు  విక్రమ్ సిన్హ్ జాహ్లా చెబుతున్నారు. ఇటీవల జరిగిన దాడులను.. బాధితుల గాయాలను గమనిస్తే  అది కేవలం ఒంటరి తోడేలు మాత్రమే చేసినవిలా ఉన్నాయన్నారు. ఎందుకంటే గుంపు మొత్తం దాడి చేస్తే  మనుషుల మృత దేహాలు గుర్తు పట్టడానికి వీలు లేకుండా ఛిద్రమైపోయేవి. కానీ దొరికిన మృత దేహాలను బట్టి చూస్తే కొన్ని గాయాలు మాత్రమే ఉన్నాయన్నారు. తోడేళ్ల గుంపు దాడి చేస్తే చిన్నారుల తలలను వేరే చోట చెల్లా చెదురుగా పడేసేవని విక్రమ్ అన్నారు. కానీ తాజాగా దొరికిన అన్ని  మృత దేహాలలో కొన్ని గాయాలు మినహా పెద్దగా దెబ్బ తినలేదని.. వాటి మాంసం కొంత మాత్రమే తినేసి ఆ జంతువును వదిలేసినట్లు గుర్తించామన్నారు. తోడేలు ఒక సారి 5 నుంచి 6 కిలోల మాంసం మాత్రమే తినగలదని అదే గుంపు ుంటే భారీ జంతువును సూైతం తేలిగ్గా తింటాయని వివరించారు. కాగా తోడేళ్లు క్రాస్ బ్రీడ్ చేసిన కుక్కలను యూపీలో పెంచుకునే అలవాటు యూపీ లో ఉందన్నారు. బహుశా ఇలా కుక్కలతో సంకరీకరణ చేయడం వల్లే వాటి సహజ గుణమైన గుంపులో తిరగడం మరచి ఒంటరిగా తిరుగుతోందన్నారు.  ఈ హైబ్రిడ్ తోడేళ్లకు మనుషలంటే భయం పోవడం కూడా బహరాయిచ్ లో ఇలాంటి పరిస్థితికి కారణం అని విక్రమ్ సిన్హా చెప్పుకొచ్చారు.