calender_icon.png 4 January, 2025 | 4:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోనులో మ్యాన్ ఈటర్..

02-01-2025 12:25:45 AM

ఆసిఫాబాద్ సరిహద్దులో మగపులిని బంధించిన మహారాష్ట్ర అధికారులు 

కుమ్రంభీం ఆసిఫాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లా ప్రజలను గత రెండు నెలలుగా భయభ్రాంతులకు గురిచేస్తున్న పులిని సిర్పూర్ టి మాకిడి అటవీ ప్రాంతానికి ఏడు కిలోమీటర్ల దూరంలోని మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లా ఆత్మారాంగుడా సమీప అటవీ ప్రాంతంలో అక్కడి ఫారెస్ట్ అధికారులు మంగళవారం రాత్రి పట్టుకున్నారు.

గత ఏడాది నవంబర్ 29న కాగజ్‌నగర్ గన్నారం గ్రామ సమీపంలో వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తున్న లక్ష్మిపై పులి దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మరుసటి రోజు సిర్పూర్ టి మండల సమీపంలో చేనులో పత్తి ఏరుతున్న రైతు సురేష్‌పై దాడికి పాల్పడింది.

అప్పటి నుంచి పులి కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలో సంచరిస్తూ ఏదో ఒక చోట దర్శనం ఇవ్వడంతో జిల్లా ప్రజలకు కంటినిండా నిద్ర కరువైంది. పులులు మహారాష్ట్ర వైపు నుంచి జిల్లాకు వస్తున్నట్లు జరిగిన ప్రచారం నేపథ్యంలో అక్కడి అటవీశాఖ అధికారులు పులిని పట్టుకునేందుకు వన్యప్రాణుల సంరక్షణ విభాగానికి నివేదిక సమర్పించారు.

మాన్ ఈటరుగా మారిన మగ పులిని పట్టుకునేందుకు అనుమతులు లభించడంతో మహారాష్ట్ర ఫారెస్ట్ అధికారులు పులిని పట్టుకునేందుకు గత వారం రోజులుగా ప్రయత్నాలు మమ్మురం చేశారు