గాలిస్తున్న ఫైర్ సిబ్బంది
బిజినపల్లిలో ఘటన
నాగర్ కర్నూల్, విజయక్రాంతి: బైకుపై ప్రయాణిస్తూ అదుపుతప్పి కేఎల్ఐ కాల్వలో వ్యక్తి గల్లంతైన ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం మంగనూరు గ్రామ శివారులోని కేఎల్ఐ కాల్వ వద్ద సోమవారం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బిజినపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామానికి చెందిన రాముడు (40) గౌరారం వద్ద ఉన్న తన భార్య వద్దకు ఆదివారం మధ్యాహ్నం వెళ్తుండగా రోడ్డు కల్వర్టుకు ఢీకొని కేఎల్ఐ కాలువలోకి జారిపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఫైర్ సిబ్బంది సాయంతో ఆచూకీ కోసం గాలిస్తున్నారు.