calender_icon.png 28 April, 2025 | 9:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి

28-04-2025 01:38:18 AM

చేవెళ్ల , ఏప్రిల్ 27 : చెరువులోకి చేపలు పట్టడానికి వెళ్లి ఫిట్స్ రాడంతో ప్రమాదవశాత్తు అందులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. శంకర్పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్పల్లి మున్సిపల్ పరిధి బుల్కాపూర్ వార్డుకు చెందిన గడ్డం లక్ష్మయ్య(44) అదే వార్డులోని గూడెపు ఓడ్క కుంట (చెరువు)లో శనివారం చేపలు పట్టడానికి వెళ్లాడు.

ఆదివారం మధ్యాహ్నం 12గంటల సమయంలో చెరువులో మృతదేహమై కనిపించాడు. మృతు డికి ఫిట్స్ వస్తుందని, గతంలో కూడా కిందపడిపోయిన ఘటనలు చోటు చేసుకున్నా యి. మృతుడి భార్య జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.