మహేశ్వరం (విజయక్రాంతి): సంక్రాంతి సందర్భంగా గాలిపటం ఎగరవేస్తూ బిల్డింగ్ పై నుండి ఓ వ్యక్తి కాలుజారి రోడ్డుపై పడి మృతి చెందిన సంఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బుధవారం ఇన్స్పెక్టర్ కీసర నాగరాజు తెలిసిన వివరాల ప్రకారం... జిల్లెల్ల గుడా, శ్రీ సాయి బాలాజీ నగర్ కు చెందిన కంటే అశోక్ కుమారుడు మహేష్ (39) తన స్నేహితులు, అన్నదమ్ములతో కలిసి తన ఇంటి ఎదురుగా ఉన్న బిల్డింగ్ పై సంక్రాంతి పండగ సందర్భంగా పతంగులు ఎగరేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి మూడో ఫ్లోర్ పైనుండి రోడ్డుపై పడగా తీవ్రమైన గాయాలు అయ్యాయి. అపస్మారక స్థితిలోకి వెళ్ళగా చుట్టుపక్కల వారు హుటాహుటినా మహేశ్ ను అపోలో డిఆర్డిఓ హాస్పిటల్ కు తీసుకెళ్లగా డాక్టర్లు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మహేష్ భార్య కంటే అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.