11-04-2025 12:03:16 AM
గోపాలపేట ఏప్రిల్ 10: చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపి న వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం పోలికపా డు గ్రామానికి చెందిన చిన్న రాములు (45) భార్య మంజుల ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామంలో కొద్దిపాటి వ్యవసాయాన్ని సాగు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా చిన్న రాములు చేపల వేటకు వెళ్లే అలవాటు ఉంది .
ఈ క్రమంలో మంగళవారం పొలం దగ్గరికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి పొలం పక్కనే ఉన్న చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. చిన్న రాములు కు అప్పుడప్పుడు ఫిడ్స్ వస్తుండేది. చేపల వేటకు వెళ్లిన రాములు ఫిట్స్ వచ్చి అందు లో పడిపోయి ఉంటాడని గ్రామస్తులు వాపోతున్నారు.
పొలం పక్కనే ఉన్న ఓ రైతుకు చిన్న రాములు చెప్పులు ఓ బీడీ కట్ట బొడ్డుపై కనిపించింది. దీంతో రాములు చెరువులో పడిపోయి ఉంటాడని వెతికారు. అతని జాడ కానరాకపోయేసరికి ఇంటికి తిరిగివచ్చారు. గురువారం మూడు గంటల సమయంలో చెరువులో శివమై తేలినట్లు పోలీసులు తెలిపారు.ఈ సంఘటనపై భార్య ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర నరేష్ కుమార్ తెలిపారు.