calender_icon.png 9 April, 2025 | 10:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

05-04-2025 06:56:50 PM

పటాన్ చెరు: చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు కాలికి వల చుట్టుకోవడంతో మృతి చెందాడు. ఈ ఘటన కొడకంచి పంచాయతీ పుట్టగూడా సమీపంలోని నల్లచెరువులో జరిగింది. జిన్నారం ఎస్సై నాగలక్ష్మి, కొడకంచి గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... కొడకంచి గ్రామానికి చెందిన కంచనపల్లి ఆంజనేయులు(49)  పుట్టగూడ సమీపంలోని నల్లచెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. శనివారం మధ్య రాత్రి సమయంలో వల కాళ్లకు చుట్టుకోవడంతో ఆంజనేయులు ఊపిరాడక నీటిలో మృతి చెందాడు. మృతుని కొడుకు జితేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.