calender_icon.png 27 April, 2025 | 7:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

27-04-2025 12:00:46 AM

నాలుగు రోజుల క్రితం భార్యను చంపి పరారీ

గుడిహత్నూర్, ఏప్రిల్ 26: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో ఈ నెల 23న మారు తి అనే వ్యక్తి తన భార్య కీర్తిని కత్తితో గొంతు కోసి అత్యంత కిరాతంగా హత్య చేసి పరారయ్యాడు. గత నాలుగు రోజులుగా పరారీలో ఉన్న మారు తి శనివారం గ్రామ శివారులో  అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించాడు.

ఇచ్చోడ సీఐ భీమేష్, గుడిహ త్నూర్ ఎస్సై మహేందర్ ఘటన స్థలానికి చేరుకుని దర్యా ప్తు చేపట్టారు. కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. మారుతి తన భార్యను చంపిన రోజే ఆత్మహత్య చేసుకున్నా డా? లేదా ఎవరైనా కొట్టి చంపరా అనేది తెలియాల్సి ఉంది.