calender_icon.png 8 February, 2025 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

08-02-2025 12:00:00 AM

కొండపాక, ఫిబ్రవరి 7: అనుమానా స్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘ టన కొండపాక మండలం దుద్దెడ శివారు లో సేలంపు వద్ద శుక్రవారం చోటుచేసు కుంది. వివరాల్లోకి వెళ్తే చేర్యాల మండలం ఆకునూరు గ్రామానికి చెందిన దొండకా యల కనకయ్య (55) అనే వ్యక్తి మృతదే హం చెట్ల పొదలలో పడి ఉంది.

ప్రస్తుతం ఆయన సిద్దిపేట హనుమాన్ నగర్‌లో నివా సం ఉంటున్నారు. ఆయన మెడ చుట్టూ కమిలిన గాయం ఉంది. దీన్నిబట్టి ఎవరో చంపి తీసుకువచ్చి ఇక్కడ పడేసినట్టు భావిస్తున్నారు. భూతగాదాల కారణంగానే చంపేసి ఉంటారని భావిస్తున్నారు. త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు చేస్తున్నామని తెలిపారు. సంఘటన స్థలాన్ని సిద్దిపేట ఏసిపి మధు, క్లూస్ టీం పరిశీలించారు.