27-03-2025 11:08:21 PM
టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామ సమీపంలోని కారుకొండ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న జామయిల్ యార్డు వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వత్సవాయి మండలం ఖమ్మంపాడు గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. టేకులపల్లి ఎస్సై పోగుల సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపి రాష్ట్రం వత్సవాయి మండలం, ఖమ్మంపాడు గ్రామానికి చెందిన బండి రామకృష్ణ (50) అనే వ్యక్తి టేకులపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామ పంచాయితీ పరిధి కారుకొండ క్రాస్ రోడ్ వద్ద జామయిల్ యార్డు వద్దకి గురువారం మధ్యాహ్నాం వచ్చిన రామకృష్ణ కాసేపు పడుకొని ఒక్కసారిగా నాకు ఊపిరి ఆడట్లేదాని అంటూ కూర్చొని మళ్ళీ పడిపోయాడు. అంబులెన్సులో వచ్చిన వైద్య సిబ్బంది చనిపోయాడని తెలిపారు. మృతుడి వద్ద బట్టలు, టాబ్లెట్స్, సెల్ఫోన్ సహాయంతో అడ్రస్ గుర్తించినట్లు ఎస్సై తెలిపారు. బాడీని కొత్తగూడెం మార్చురికి తరలించినట్లు తెలిపారు.