calender_icon.png 6 April, 2025 | 1:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

05-04-2025 08:45:45 PM

కొల్చారం,(విజయక్రాంతి): ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని వరిగుంతం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... బాలయ్య వాళ్ల పోచయ్య(32) కులం ముదిరాజ్ మృతి వ్యవసాయం గ్రామం వరిగుంతం, వృత్తి సెంట్రింగ్ మేస్త్రి శనివారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంట్లో నీళ్లు పట్టడానికి వెళుతున్నానని ఇంట్లో భార్యతో  చెప్పి వెళ్ళినాడు. తర్వాత మధ్యాహ్నం అందాగా 1.50 గంటల సమయంలో నా కొడుకు అగు బాలయ్య వాళ్ళ నరేందర్  నా వద్దకు వచ్చి నాన్న మనం నూతనంగా నిర్మిస్తున్న ఇంట్లో గోడలపై నీళ్లు పట్టుచుండగా ప్రమాదవశక్తుగా రోడ్డు వద్ద ఉన్న వైరు ఎడమ చేయి అరచేతిపై కరెంటు షాక్ తగలగా కిందపడి స్పృహ కోల్పోయినాడు అని తెలుపగా వెంటనే నేను, కుటుంబ సభ్యులము వెళ్లి చూడగా నిజంగానే కిందపడి ఉండగా వెంటనే చికిత్స గురించి మెదక్ ప్రభుత్వాసుపత్రికి తీసుకొని పోగా మధ్యాహ్నం అందాజ రెండు గంటల సమయంలో డ్యూటీ డాక్టర్ గారు చెక్ చేసి  పోచయ్య మరణించినాడు అని తెలిపినాడు మేము నూతనంగా నిర్మిస్తున్న ఇంట్లో గోడలకు నీళ్లు పట్టుచుండగా  విద్యుత్ షాక్ తగిలి పోచయ్య మరణించాడు మరణం పై మాకు ఎవరిపై ఎలాంటి అనుమానం లేదు అని మృతుని భార్య చంద్రకళ ఫిర్యాదులో పేర్కొన్నారు మృతుని భార్య చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహమ్మద్ గౌస్ వెల్లడించారు.