07-04-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 6(విజయ క్రాంతి): ప్రమాదవశాత్తు సోలార్ విద్యుత్ తీగలు తగిలి రైతు చెందిన సంఘటన ఆసిఫాబాద్ మండలం ఇప్పలనవేగం గ్రామంలో చోటుచేసుకుంది. సీఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం నీ కోరే బాపూజీ తన శనివారం ఎడ్లు ఇంటికి రాకపోవడంతో ఆదివారం ఉదయం ఎడ్ల జాడ కోసం వ్యవసాయ భూములలో గాలింపు చర్యలు చేపట్టాడు.
ఈ క్రమంలో రాథోడ్ వివేక్ కుమార్ కు చెందిన వ్యవసాయ భూమి వద్ద సోలార్ కరెంట్ తీగలు తాకి విద్యుత్ షాక్ తో మరణించాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.