చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట మండలంలో గల శ్రీ వెంకటేశ్వర శాముల్ డిపోలో డైలీ వర్కర్ గా పని చేసుతున్న అనంత సాగర్ గ్రామానికి చెందిన మెండే నర్సిములు (35) ఇతను చేగుంటలో డైలీ లేబర్ గా గత 10 సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. ఈరోజు ఉదయం 9:30 గంటలకు ప్రమాదశాత్తు చేతికి కరెంట్ వైర్ తగలడంతో కింద పడిపోయాడు. మెరుగైన చికిత్స నిమిత్తం నర్సింగ్ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయారు. చేగుంట పోలీసులు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.