12-02-2025 04:50:41 PM
వైన్స్ ను తనిఖీచేసిన ఎక్సైజ్, పోలీస్ అధికారులు...
చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా మసాయిపేట్ పట్టణ కేంద్రం గల ప్రకృతి వైన్స్ పక్కన కొల్చారం గ్రామానికి చెందిన శంకర్ (32)అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శంకర్ గత రెండు సంవత్సరాల నుండి చిన్న శంకరంపేట్ మండల్ ధరిపల్లి గ్రామంలో కూలి పని చేసుకుంటూ జీవించేవాడు అని స్థానికులు తెలియపరిచారు. విషయం తెలుసుకున్న చేగుంట పోలీసులు కేసు నమోదు చేసి, రామయంపేట్ ఎక్సైజ్ శాఖ వారికీ సమాచారం ఇవ్వగా నేడు ప్రకృతి వైన్స్ లో తనిఖీలు నిర్వహించారు.