24-04-2025 12:12:48 AM
రేవల్లి : ఏప్రిల్23: మండలం పరిధిలోని నాగపూర్ గ్రామానికి చెందిన యాలాల మల్లయ్య (55) రోడ్డు ప్రమాదంలో అకాల మృతిచెందాడు,కుటుంబ సభ్యుల గ్రామస్తుల కథనం మేరకు మృతుడు గుడ్లనర్వలో తన సమీప బంధువుల ఇండ్లలో వివాహ వే డుకల్లో పాల్గొనడానికి కుటుంబ సభ్యులను పంపి వ్యవసాయ పనులు చక్కదిద్దుకొని బుధవారం మధ్యాహ్నం తన ద్విచక్ర వాహనంపై బయలుదేరి వెళ్లాడు నాగర్ కర్నూల్ సమీపంలోకి చేరుకోగానె నాగనూరు.
మధ్య లో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికిగురై తాను ప్రయాణిస్తున్న రోడ్డుపక్కల వరి చేనులో పడి మృతి చెంది ఉన్నాడు, అక్కడి బాటసారులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి అంబులెన్స్ సాయం తో నాగర్ కర్నూల్ ప్రభుత్వాసు తరలించగా, అప్పటికే మృతి చెందిఉన్నాడని గ్రామస్తులు తెలిపారు, దీంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అనుకున్నాయి, ప్రభుత్వ పరంగా మృతుని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు