13-03-2025 10:37:22 PM
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సబ్దల్ పూర్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డి మండలంలోని సద్దల్పూర్ గ్రామానికి చెందిన గడ్డం పోచయ్య(65) హోలీ పండుగ సందర్భంగా మటన్ తీసుకెళ్లడానికి ఎల్లారెడ్డి మార్కెట్ కి వచ్చారు. మటన్ తీసుకొని తిరిగి ఇంటికి వెళుతుండగా గాంధీ చౌక్ వద్ద గల మెట్రో షాప్ ముందు ఒక ఆటో అతివేగంగా,అజాగ్రత్తగా వచ్చి వెనక నుండి పోచయ్యను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పోచయ్యకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలోనే అతను మృతి చెందాడు.ఈ ఘటనకు సంబంధించి మృతుని అన్న కుమారుడు గడ్డం లచ్చయ్య ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్లారెడ్డి పోలీసులు తెలిపారు.