calender_icon.png 4 March, 2025 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

04-03-2025 01:23:04 AM

ఇబ్రహీంపట్నం, మార్చి 3 (విజయ క్రాంతి): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రిగూడం మండలం, ఎరగండ్లపల్లి గ్రామానికి చెందిన మైలారం జంగయ్య (27), సోమవారం తన భార్య పార్వతమ్మ (25), కుమార్తె అశ్విత(9) తో కలిసి బైక్ పై ఆగపల్లి నుండి  ఇబ్రహీం పట్నం వస్తుండగా మార్గం మధ్యలో గురునానక్ కాలేజ్ వద్దకు చేరుకునే క్రమంలో ఎదురుగా, అతివేగంగా వచ్చిన కారు బైకును బలంగా ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో జంగయ్య అక్కడికక్కడే మృతి చెందగా, భార్య, కుమార్తెకు గాయాల య్యాయి. సమాచారం అందుకున్న పోలీ సులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీ లించారు. ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్, సంతోష్నగర్ లో నివాసం ఉండే కోవూరి నర్సింగరావు (54) అనే వ్యక్తి నిర్ల క్ష్యంగా, అతివేగం కారణంగానే ఈ ఘటన జరిగిందని, ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.