సిరిసిల్ల, డిసెంబర్ 22 (విజయ క్రాంతి): సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్‌కు చెందిన గాజుల సత్యనారాయణ( 50) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదాలు మృతి చెందినట్లు టౌన్ సీఐ కృష్ణ తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సత్యనారాయణ తన ద్విచక్ర వాహనంపై వెంకట్రావు నగర్ నుండి కొత్త బస్టాండ్ వైపు వెళుతుండగా, పెద్దూరు వైపు వెళ్తున్న ఫోర్స్ ట్రావెలర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలు అవడంతో మృతి చెందాడు. అతివేగం,అజాగ్రత్తగా నడిపిన విలాసాగరం అరెస్టు చేశామని, మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కృష్ణ వెల్లడించారు.