calender_icon.png 13 March, 2025 | 6:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు, ద్విచక్ర వాహనం ఢీ.. వ్యక్తి మృతి

13-03-2025 01:08:52 AM

దౌల్తాబాద్,(విజయక్రాంతి):  కారు, ద్విచక్ర వాహనానికి ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన దౌల్తాబాద్ మండలం నర్సంపేట గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. దౌల్తాబాద్ మండలం శేరిపల్లి బందారం గ్రామపంచాయతీ మధిర గ్రామమైన నర్సంపేటకు చెందిన వనం రాజు (35) అనే వ్యక్తి తన అత్తగారి గ్రామం అయిన రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో మల్లేశంపల్లి నర్సంపేట గ్రామాల మధ్య ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వనం రాజు తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108 వాహనంలో చికిత్స నిమిత్తం గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. గజ్వేల్ తరలించే క్రమంలోనే 108 వాహనంలోనే రాజు మృతి చెందినట్లు వారు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య రమ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.