కోరుట్ల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని వెంకటాపూర్, మోహన్ రావుపేట గ్రామాల మధ్య శనివారం అర్ధరాత్రి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగి బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కోరుట్ల వైపు బైక్ పై వస్తున్న వ్యక్తిని, జగిత్యాల వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందగా, కారు సమీపంలో చెట్టుకు ఢీకొనగా అందులో ఉన్న నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.