10-02-2025 05:14:19 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): నల్గొండ జిల్లాలో తేనెటీగల దాడిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. నక్రేకల్ మండలం అర్లగడ్డగూడెం గ్రామంలో తేనెటీగల గుంపు ఒకసారిగా ముగ్గురిపై దాడి చేశాయి. ఈ తేనెటీగల దాడిలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడడంతో వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నక్రేకల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పిడుగు ప్రభాకర్(57) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.