18-03-2025 10:59:42 PM
నిజాంసాగర్ (విజయక్రాంతి): కాలకృత్యాల కోసం వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన మహమ్మద్ నగర్ మండలం బూర్గుల గ్రామంలో చోటుచేసుకొంది. నిజాంసాగర్ ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం రోజున బూర్గుల్ గ్రామానికి చెందిన రామగళ్ళ దశరథ్ (37) సంవత్సరాలు కాలకృత్యలకని నిజాంసాగర్ మెయిన్ కెనాల్ వద్దకు వెళ్లి అక్కడ ప్రమాదవశాత్తు కెనాల్ నీటిలో పడి గల్లంతయిన వ్యక్తి శవం మంగళవారం దొరికిందని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నిజాంసాగర్ ఎస్ఐ తెలిపారు.