19-03-2025 01:11:44 AM
ఎల్బీనగర్, మార్చి 18 : కడుపు నొప్పి బాధపడుతున్న వ్యక్తి దవాఖానలో చేరితే సరైన వైద్యం అందక మృతి చెందిన ఘటన హస్తినాపురం లోని అరుణ దవాఖానలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే... సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్న గ్రామానికి చెందిన బొమ్మకంటి నరేశ్ (32) భార్య మాధవి, ఇద్దరు ఆడపిల్లలలో కలిసి బీఎన్ రెడ్డి నగర్ లోని చైతన్యనగర్ కాలనీలో నివాసముంటున్నారు.
కాగా, మంగళవారం ఉదయం నరేశ్ కడుపునొప్పితో బాధపడుతుండగా... కు టుంబ సభ్యులు వెంటనే హస్తినాపురం లోని అరుణ దవాఖానలో చేర్పించారు. చికిత్స పొందుతూ సాయంత్రం నరేశ్ మృతి చెందాడు. వైద్యులు సకాలంలో స్పందించకపోవడంతోపాటు సరియైన చికిత్స ఇవ్వక పోవడంతో నరేశ్ మృతి చెందాడని కుటుం బ సభ్యులు ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని మృతుడి భార్య మాధవి కుటుం బ సభ్యులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ మేరకు వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.