calender_icon.png 5 January, 2025 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదవశాత్తు నీట మునిగి వ్యక్తి మృతి...

02-01-2025 08:18:56 PM

పాపన్నపేట: ప్రమాదవశాత్తు నీట మునిగి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని పొడిచన్ పల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన బుట్ట జీవయ్య (63) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం గ్రామ శివారులోని మంజీరా నది ఒడ్డున ఉన్న పొలం వద్ద నీరు పెట్టేందుకు వెళ్లాడు. నీళ్లు పెట్టేందుకు మోటారు ఆన్ చేయగా పనిచేయకపోవడంతో నదిలోకి దిగి ప్రమాదవశాత్తు నీట మునిగి ఊపిరాడక మృతి చెందాడు. సమీప పొలాల వారు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకొని స్థానికుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీసారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. భార్య కిష్టమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.