calender_icon.png 20 April, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్విచక్ర వాహనం చెట్టును ఢీకొని వ్యక్తి మృతి

11-03-2025 07:36:28 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండలం బోడు గ్రామానికి వెళ్లే రహదారిలోని పెద్దమ్మ తల్లి గుడి సమీపంలోని మూలమలుపు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఆ ఘటనలో గాయాలపాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి గ్రామానికి చెందిన జోగ వంశీ, పొడుగు ప్రవీణ్ అనే యువకులు పల్సర్ ద్విచక్ర వాహనంపై వేగంగా వెళుతూ పెద్దమ్మ గుడి,  తుమ్మలచెలక గ్రామాల మధ్యలోని మూలమూలుపు వద్ద చెట్టును ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలు అవ్వగా, మార్గంలో వెళ్లే ప్రయాణికులు గుర్తించి ఆటోలో మొదట మండలంలోని సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ఉసిరికాయలపల్లకి చెందిన జోగ వంశీ చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం విదితమే. గాయాల పాలైన పొడుగు ప్రవీణ్ పరిస్థితి విషమంగా  ఉండగా కొత్తగూడెం నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం లోని మమత వైద్య శాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిసింది. ప్రవీణ్ హైద్రాబాద్లో ఎలక్ట్రిషన్ గా పని చేస్తున్నట్లు తెలిసింది. టేకులపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.