నిజామాబాద్ జిల్లా యానంపల్లి గుట్ట వద్ద ఘటన
నిజామాబాద్,(విజయక్రాంతి): ఓ బైకును ట్రాక్టర్ ఢీ కొట్టిన ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా మామిడిపల్లి శివారులోని యానంపల్లి గుట్ట వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... నిజాంబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం కేశీపల్లి గ్రామానికి చెందిన గంగాధర్ బైకుపై పని నిమిత్తం ఆర్మూర్ కు వెళ్లాడు. తిరిగి స్వాగ్ గ్రామానికి శుక్రవారం వెళ్తుండగా యానంపల్లి గుట్ట వద్ద రాంగ్ రూటులో వచ్చిన ట్రాక్టర్ బైకును ఢీ కొట్టింది. బైకుపై వెళ్తున్న గంగాధర్ 42 అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గంగాధర్ మృతి చెందడంతో కేసుపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుని భార్య సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జక్రాన్ పల్లి పోలీసులు తెలిపారు.