29-03-2025 11:18:28 PM
రాజేంద్రనగర్ (విజయక్రాంతి): బైకు అదుపుతప్పి కింద పడటంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి కథనం ప్రకారం.. మైలార్దేవపల్లి లోని ఓవైసీ హిల్స్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ అజఘర్ ఆలీ తేది ఈనెల 19న సాయంత్రం 04.30 గంటలకు తన పల్సర్ బైక్ పైన పాల్మకుల నుండి ఇంటికి వెళ్తున్నాడు.
5 గంటలకు తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డు రమా సెంటర్ దగ్గరకు రాగానే వేగంగా వెళుతున్న బైకు అదుపుతప్పి కిందపడింది. మహమ్మద్ అజఘర్ తలకు బలమైన గాయాలు అవడంతో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కు పంపగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి తెలియజేశారు.