calender_icon.png 2 April, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు తల్లి ఫ్లైఓవర్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

31-03-2025 10:27:51 AM

హైదరాబాద్: ట్యాంక్ బండ్(Tank Bund) వద్ద ఉన్న తెలుగు తల్లి ఫ్లైఓవర్(Telugu Talli Flyover) పై నుంచి సోమవారం తెల్లవారుజామున ఒక వ్యక్తి  దూకి ప్రాణాలు తీసుకున్నాడు. బాధితుడిని ఇంకా గుర్తించలేదు. ఫ్లైఓవర్ ఎక్కి లోయర్ ట్యాంక్ బండ్ ల్యాండింగ్ వైపు నుండి దూకాడు. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుడు యాచకుడిగా అనుమానిస్తున్నట్లు దోమలగూడ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఆత్మహత్యకు గల కారణం తెలియరాలేదు. అతన్ని గుర్తించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. దర్యాప్తు జరుగుతోంది.