calender_icon.png 21 March, 2025 | 1:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డివైడర్ కు ఢీకొని వ్యక్తి మృతి

20-03-2025 10:28:37 PM

మరొకరి పరిస్థితి విషమం...

కొండపాక: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన కుకునూరుపల్లి బస్టాండ్ ముందు రాజీవ్ రహదారిపై గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. గజ్వేల్ మండలం దిలాల్పూర్ గ్రామానికి చెందిన క్యాసారం బాబు (27) ద్విచక్ర వాహనంపై సిద్దిపేట వైపు నుంచి గజ్వేల్ వెళుతుండగా కుకునూరుపల్లి బస్టాండ్ వద్దకు రాగానే బైక్ అద్భుతప్పి డివైడర్ మధ్యలో ఉన్న వ్యక్తి స్తంభానికి ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం వెనుక ఉన్న అతని మిత్రుడు బోనాల యాదగిరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుని వైద్యం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు. విషయం తెలుసుకున్న తొగుట సిఐ లతీఫ్, కుకునూరు పల్లి ఎస్ఐ శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.