calender_icon.png 11 April, 2025 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రైనేజీలో పడి వ్యక్తి మృతి

04-04-2025 05:03:29 PM

మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

పాల్వంచ, (విజయక్రాంతి): మున్సిపాలిటీ పరిధిలోని సంజయ్ నగర్ గ్రామానికి చెందిన ఎస్ వెంకన్న అనే వ్యక్తి గురువారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో నవభారత్ లోని వైన్స్ వద్ద డ్రైనేజీలో పడి మృతి చెందాడు. మద్యం దుకాణం వద్ద గత కొన్ని రోజుల క్రితం మరమతుల కోసం ఓపెన్ చేసిన డ్రైనేజీలో చీకటి సమయం కావడం, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో డ్రైనేజీ కనిపించకపోవడంతో దాంట్లోపడి నవభారత్ ఎస్బిఐ  బ్యాంక్ వరకు కొట్టుకొని పోయి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.  స్థానికులు అంతా పరుగులు తీసి బ్యాంక్ వద్దకు చేరుకొని కొట్టుకు వచ్చిన వెంకన్న బయటికి తీసి ప్రధమ చికిత్స చేస్తున్న క్రమంలో అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది. వెంటనే స్థానికులు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో కుటుంబ ఆర్తనాధాలతో నవభారత్ దద్దరిల్లింది. స్థానికులు మున్సిపల్టి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి ఎక్కడైతే ఓపెన్ డ్రైనేజీలు ఉన్నాయో వాటిని క్లోజ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుకుంటున్నారు.