04-03-2025 11:42:38 PM
చేవెళ్ల: చేవెళ్లలోని వెంకటేశ్వర స్వామి జాతరకు వెళ్లిన వ్యక్తి గుండంలో పడి చనిపోయాడు. పోలీసుల వివరాల ప్రకారం... తాండూరు మండలం గోనూరు చెందిన కురువ బిచ్చప్ప(45) నాలుగేళ్ల కింద భార్య, కుటుంబ సభ్యులతో కలిసి అత్తగారి ఊరైన చేవెళ్ల మండలం కిష్టాపూర్ కు వచ్చి అక్కడే కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం ఉదయం బిచ్చప్ప చేవెళ్ల జాతరకు పోదామని భార్యతో చెప్పాడు. ఆమె మధ్యాహ్నం తర్వాత వెళ్దామని చెప్పి పనికి వెళ్లిపోయింది. పని నుంచి మధ్యాహ్నం 2 గంటల సమయంలో తిరిగి రాగా.. భర్త కనిపించలేదు. సాయంత్రం 4 గంటల సమయంలో ఆమె బాబాయి విఠలయ్య ఫోన్ చేసి... బిచ్చప్ప గుండంలో పడి చనిపోయాడని, మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారని చెప్పాడు. ఆమె వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చూడగా.. విగత జీవిగా దర్శనం ఇచ్చాడు. గుండంలో స్నానానికి దిగి కాలుజారి నీటిలో పడిపోయి ఉంటాడని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.