calender_icon.png 15 April, 2025 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృతి.. గొడవకు దిగిన వాహనదారులు

13-04-2025 02:45:36 PM

హైదరాబాద్: బాలానగర్ పోలీస్ స్టేషన్(Balanagar Police Station) పరిధిలో ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృత్యువాత పడ్డాడు. వాహన తనిఖీల్లో భాగంగా ఆపే క్రమంలో అదుపుతప్పి బైకర్ కిందపడిపోయాడు. బైకు నడిపే వ్యక్తి తలపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని వాహనదారులు ఆందోళనకు దిగారు. వాహనదారుల ఆందోళనతో మూడు కిలో మీటర్ల మేర రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో జీడిమెట్ల నుంచి బాలానగర్(Jeedimetla to Balanagar) మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదానికి దిగిన వాహనదారులను పోలీసులు చెదరగొట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.