calender_icon.png 11 March, 2025 | 1:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవనం పై నుంచి కిందపడి వ్యక్తి మృతి

10-03-2025 10:30:02 PM

కేసు నమోదు చేసిన సరూర్ నగర్ పోలీసులు...

ఎల్బీనగర్: సరూర్ నగర్ లోని బాపు కమ్యూనిటీ హాల్ సమీపంలో ఒక భవనం పై నుంచి కిందపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఏపీ లోని శ్రీకాకుళం జిల్లా పుట్ పట్నం మండలం కగువాడ గ్రామానికి చెందిన బొడ్డు కృష్ణ(50), లచ్చమ్మ దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి జీవనోపాధి కోసం సరూర్ నగర్ లోని బాపు కమ్యూనిటీ హాల్ సమీపంలో ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. కాగా, ఈ నెల 8వ తేదీన భార్యాపిల్లలు రామంతాపూర్ లో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లారు.

కృష్ణ ఒక్కడే సరూర్ నగర్ లో ఉన్నాడు. కాగా, 9వ తేదీన రాత్రి సరూర్‌నగర్‌లోని కోదండరామ్ నగర్‌లోని ఒక భవనం కింద కృష్ణ తలకు గాయం కావడంతో మృతి చెందాడని భార్య లచ్చమ్మకు బంధువులు సమాచారం ఇచ్చారు. ఆమె వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, భర్త మృతిపై సరూర్ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన భర్తకు తాగుడు అలవాటు ఉందని, భవనంలోని రెండో అంతస్తు మెట్లపై నుంచి కింద పడి ఉండవచ్చని మృతుడి భార్య పేర్కొన్నారు. ఈ మేరకు సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.